Thursday, April 16, 2026
HomeUncategorizedవిద్యుత్ వినియోగదారులకు గమనిక: రేపు పలు గ్రామాల్లో విద్యుత్ నిలిపివేత

విద్యుత్ వినియోగదారులకు గమనిక: రేపు పలు గ్రామాల్లో విద్యుత్ నిలిపివేత

జగ్గంపేట, ఏప్రిల్ 06 (జిల్లా వాణి ప్రతినిధి): జగ్గంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. వీరభద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. RDSS (Revamped Distribution Sector Scheme) పనుల నిర్వహణ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 07-04-2026 (మంగళవారం) ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ​ఈ మరమ్మత్తుల కారణంగా ఈ క్రింది ప్రాంతాల్లో ఇర్రిపాక, మామిడాడ, మరియు మర్రిపాక, నరేంద్రపట్నం మరియు రామవరం గ్రామాలకు చెందిన వ్యవసాయ బోర్లు. మర్రిపాక పరిధిలోని చేపల చెరువులకు కూడా విద్యుత్ సరఫరా ఉండదు. “పనులు త్వరగా పూర్తయ్యేందుకు వినియోగదారులు, రైతులు మరియు చెరువుల యజమానులు విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించవలసిందిగా కోరుచున్నాము.” అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular