పోలవరం జిల్లావాణి ప్రతినిధి: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని అడ్డతీగల మండలంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పేద ప్రజల పాలిట శాపంగా మారింది. వివరాల్లోకి వెళితే అడ్డతీగల మండలం కోనలోవ గ్రామంలో నిరుపేదల తాటాకు ఇళ్లపై విద్యుత్ షార్ట్ సర్క్యూట్ రూపంలో తీవ్ర నష్టాన్ని చవిచూపింది. కోనలోవ గ్రామానికి చెందిన చెవ్వేటి రత్నమ్మ, దూలపల్లి మార్తమ్మ, ఎల్లబెల్లి వెంకటేశులు, కొమ్ముకూరి సూర్యకాంతం లకు చెందిన తాటాకు గృహాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఆదివారం ఉదయం ప్రమాదానికి గురయ్యాయి. దీనితో ఆయా కుటుంబాలు కట్టుబట్టలతో వీధిన పడ్డారు. విషయం తెలుసుకున్న రంప చోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి హుటాహుటీన సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడిన ఆమె వారి బాధను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి జరిగిన నష్టంపై క్షుణ్ణంగా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ బాధితులకు తన స్వంత ఖర్చులతో నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. ప్రభుత్వం ద్వారా కూడా నష్ట పరిహారం అందేలా కృషి చేస్తానని హమీ ఇచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ రూపంలో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సదరు విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక , రెవెన్యూ సిబ్బందికి సమచారం అందించగా వారు వచ్చి మంటలు అదుపులోకి తీసుకు రావటానికి ప్రయత్నం చేశారు. అప్పటికే పూర్తిగా గృహాలు కాలిపోవటంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రమాదంలో గృహాలు పూర్తిగా కాలిపోయాయి ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లక పోవటంతో ఊపిరి పీల్చుకున్నారు . బాధితులను ఆదుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు. ఈకార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు బూర్లె హరిబాబు, అడ్డతీగల మండలం పార్టీ నాయకులు ఎడ్ల శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షులు సాకేటి రాజు, రాజవొమ్మంగి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వాసం శెట్టి గంగాధర్, తెదేపా సీనియర్ నాయకులు గణజాల తాతారావు, అడ్డతీగల జనసేన నాయకులు పొడుగు సాయి , బండారు కృపమ్మ, బేలెం రాఘవ, పాలేటి అబ్రహం, కొసనం సురేష్, తెదేపా యువజన విభాగం ప్రతినిధి కంభం ప్రమోద్, కంటపురెడ్డి వీరబాబు, వేమగిరి అర్జున్ అధిక సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు మరియు విఆర్తవో పుడిగి జాన్ పద్మ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో అడ్డతీగల ఎస్ఐ వినోద్ విధులు నిర్వహించారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో నాలుగు పూరిల్లు దగ్ధం, రోడ్డున పడ్డ కుటుంబాలు అండగా నిలిచిన స్థానిక మహిళా ఎమ్మెల్యే
RELATED ARTICLES
