
ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్నా క్యాంటీన్ ను రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు పరిశీలించడం జరిగింది. అనంతరం అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లో భోజనం వసతి సౌకర్యాలపై ఆరా తీయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు కడుపునిండా అన్నం పెట్టాలని ఉద్దేశంతో నందమూరి తారక రామారావు పేరుతో అన్నా క్యాంటీన్ ఏర్పాటుచేసి పేద ప్రజలకు 5 రూపాయల తో కడుపునింపుతున్నారని, త్వరలోనే ఎలమంచిలి నియోజకవర్గంలో మరో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని, ఇది ప్రజల ప్రభుత్వం అని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అందించాలన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గొర్లి శివన్నారాయణ మూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు కొటారు సాంబశివరావు, జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్, క్లస్టర్ ఇన్చార్జిలు బొద్దపు శ్రీనివాసరావు, కరణం రవికుమార్, పండూరి శ్రీనివాసరావు, గొర్లి బాబురావు, బొద్దపు నాగేశ్వరావు, దంట్ల వెంకటస్వామి, కర్రేడ్ల మల్లికార్జునరావు, పిల్ల గంగాధర్, కర్రీ వెంకటస్వామి, బొద్ధపు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
