Thursday, April 16, 2026
HomeAndhra Pradeshమీడియా కార్యాలయంపై వైసీపీ శ్రేణుల చేసిన దాడిని ఖండించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటి...

మీడియా కార్యాలయంపై వైసీపీ శ్రేణుల చేసిన దాడిని ఖండించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటి చైర్పర్సన్, శాసనసభ్యులు మిరియాల శిరీషాదేవి

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం పై ఉద్దేశ్య పూర్వకంగా దాడులు నిర్వహించడం హేయమైన చర్యని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం నుండి “వీకెండ్ కామెంట్ బై ఆర్కే” కార్యక్రమం లో మావిగన్ అంశం పై కథనం ప్రసారమైంది. దీనిపై వైకాపా నేతలు ఆంధ్రజ్యోతి కార్యాలయంపై భౌతిక దాడికి దిగారు. దీంతో ఆమె మంగళవారం ప్రకటన ద్వారా వైకాపా నేతల చర్యలను ఖండించారు. ఇదంతా కేవలం వైకాపా నేతలు ప్రజల మనసులు మళ్లించేందుకే ఇలాంటి దాడికి దిగారన్నారు. మీడియా సంస్థలపై భౌతిక దాడులకు దిగటం వైకాపా దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. మీడియా సంస్థల పై అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా ఎదుర్కోవాలి తప్పా ఇలా దాడులు చేయటం మంచిది కాదని హితవు పలికారు. ఇలాంటి అరాచక శక్తుల పై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular