అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన రోలుగుంట మండల పరిషత్ కార్యాలయంలో బుగర్భ జలాల అభివృద్ధి మరియు నీటి వనరుల పురోగతికి సంబంధించి 100 యాక్షన్ ప్లాన్ రూపకల్పన కోసం మండల స్థాయిలో జలధార–జలహారతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఈ ఇరిగేషన్, ఏ ఈఆర్ డబ్ల్యు ఎస్, డిప్యూటీ ఎంపీడీవో, ఏ పీ ఓ, వ్యవసాయ అధికారి, అటవీ అధికారి, నీటి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించేందుకు ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఇంజినీరింగ్ అసిస్టెంట్ల ద్వారా గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామస్థాయి అవసరాల ఆధారంగా నీటి సంరక్షణ, గుంతలు, చెక్‌డ్యాంలు, హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు వంటి పనుల ప్రాధాన్యత జాబితా రూపొందించనున్నారు.
జలధార జలహారతి మండల కమిటీ సమావేశం.
RELATED ARTICLES
