అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ పఖ్వాడా కార్యక్రమాన్ని స్థానిక సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. చిన్నపిల్లల మొదటి ఆరు సంవత్సరాల్లో మెదడు అభివృద్ధి అత్యంత కీలకమనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, సహాయకులు పాల్గొని గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల తల్లులకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సరైన ఆహార పద్దతులు, పిల్లల బరువు–ఎత్తు పర్యవేక్షణ, హాయ్‌జీన్ అలవాట్లు వంటి అంశాలపై వివరించారు.అలాగే పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలపై శ్రద్ధ పెట్టేందుకు తల్లులను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ పోషణ కార్యక్రమాల గురించి సమాచారం అందించారు. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రశ్నలు అడిగి తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్, టీచర్స్ ఆయాలు,ఏఎన్ఎమ్స్, ఆశ వర్కర్లు ఎల్ ఎం అండ్ హెచ్ వో మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
కొమరవోలు గ్రామంలో పోషణ పక్కవాడ అవగాహన కార్యక్రమం.
RELATED ARTICLES
