Thursday, April 16, 2026
HomeAndhra Pradeshగత5,6 సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లు ఎమ్మెల్యే చొరవతో పరిష్కరం

గత5,6 సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లు ఎమ్మెల్యే చొరవతో పరిష్కరం

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి గ్రామంలో గత 5,6 సంవత్సరాలు విద్యుత్ సమస్యతో విబ్బంది పడుతున్నారు. విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్న విషయం స్థానిక శాసనసభ్యురాలు మిరియాల శిరీష దేవి దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించిన ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి వెను వెంటనే జడ్డంగి ప్రధాన రహదారి వారపుసంత సమీపంలో 100 కె. వి. సామర్థ్యం గల నూతన విద్యుత్ ట్రాన్స్ పార్మర్ ను అమర్చారు. నూతన విద్యుత్ ట్రాన్స్ పార్మర్ ఏర్పాటు చేయించడంపై జడ్డంగి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది ఏఈలు అబ్బాయిదొర, శివకిరణ్, ఎల్. ఐ రమణ, లైన్ మెన్ రాజేష్, జెఎల్ యంలు శ్రీనివాస్ దొర, ప్రకాష్, రాఘవరెడ్డి తదితరులు విధులను నిర్వహించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular