Thursday, April 16, 2026
HomeUncategorizedప్రజానాయకుడు కొణతాల రామకృష్ణ

ప్రజానాయకుడు కొణతాల రామకృష్ణ


అనకాపల్లి,జిల్లావాణి
నిత్యం ప్రజలకోసం ఆలోచిస్తూ ప్రజా సమస్యల పట్ల పోరాడే ప్రజానేత కొణతాల రామకృష్ణ అని
తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కర్రి వెంకటసన్యాసి నాయుడు, జనసేనపార్టీ మండల నాయకులు ఎమ్ పిటిసి చదరం నాగేశ్వరరావు, గంగుపాము జగదీశ్, సి హెచ్ ఎన్ అగ్రహారం బ్యాంక్ ఛైర్మెన్ బంటురవి అన్నారు. ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ కృషి వలనే నియోజకవర్గంలోని అనకాపల్లి, కశింకోట మండలాల పంచాయతీల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు మరియు కల్వర్టుల నిర్మాణానికి ఐదు కోట్ల డబ్బై నాలుగు లక్షల రూపాయల నిధులను ఉపాధిహామీ పథకం పిబి జిఆర్ వై ద్వారాకేటాయించారన్నారు. అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలోని ముత్రాసి కాలనీ, దేవినగర్,శారదా నగర్ సిమెంట్ రోడ్లకు 32లక్షలు,తుమ్మపాలకు 45లక్షలు కేటాయించారన్నారు. బట్లపూడి పంచాయతీకి 20 లక్షలు,కుంచంగికి 17.5 లక్షలు, సుందరయ్యపేటకు 23 లక్షలు, మారేడుపూడికి 29 లక్షలు, శంకరం పంచాయతీకి 17 లక్షలు, మామిడిపాలెంకు 24 లక్షలు,వేటజంగాలపాలెంకు 19.5లక్షలు, గోపాలపురం, పాపయ్యసంతపాలెంలకు చెరో 18లక్షలు మరియు సత్యనారాయణపురంనకు 70లక్షలు మంజూరు చేసారన్నారు. కశింకోట మండలంలోని సుందరయ్యపేట పంచాయతీకి 18 లక్షలు, వెదురుపర్తికి 49లక్షలు, తీడ పంచాయతీకి 45 లక్షలు, పరవాడపాలెంకు 20లక్షలు, విసన్నపేటలో కల్వర్టు నిర్మాణానికి 15 లక్షలు,సోమవరం కల్వర్టులకు 26 లక్షలు, పేరంటాలపాలెంకు 48 లక్షలు,నూతనగుంటపాలెంకు 20 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు.అనకాపల్లి గ్రామీణ ప్రాంత రోడ్లకు కోట్లాది రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించడం సంతోషకరమన్నారు. నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మాకవరం సర్పంచ్
మొయ్య భవాని నూకరాజు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular