పోలవరం జిల్లావాణీ ప్రతినిధి : రంపచోడవరం డివిజన్ మారేడుమిల్లి మండలం దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వాంతులు విరోచనాలు, కడుపు నొప్పులతో బాధపడుతున్న వారిని మెరుగైన వైద్య సేవలు అందించి రంపచోడవరం ఏరియా ఆస్పత్రి నుండి మంగళవారం 13 మంది విద్యార్థులను డిశ్చార్జ్ చేయడం జరిగిందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి,పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ స్మరణ్ రాజ్ మాట్లాడుతూ గత శనివారం దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో కడుపునొప్పి, వాంతులు విరోచనాలతో బాధపడుతున్న వారిని హుటాహుటిన రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి మెరుగైన వైద్య సేవల కొరకు తరలించడం జరిగిందని ఆయన తెలిపారు. మంగళవారం 13 మంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఆరోగ్యం బాగున్నందున ఆసుపత్రి నుండి డీఛార్జీ చేయడం జరిగిందని ఆయనతెలిపారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న విద్యార్థులు అందర్నీ డిశ్చార్జ్ చేసి దేవరపల్లి ఆశ్రమం పాఠశాలకు విద్యార్థులను తీసుకుని వెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు. దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో డీఎం అండ్ హెచ్ ఓ పి.సరిత ఆధ్వర్యంలో 7వ తారీఖు నుండి విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా నిరంతరముగా ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా విద్యార్థుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహించిన ఎడల శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి విద్యార్థికి కాచి చల్లార్చిన త్రాగునీరు ప్రతిరోజు అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
నేడు ఏరియా ఆస్పత్రి నుండి 13 మంది విద్యార్థులు డిశ్చార్జ్
RELATED ARTICLES
