అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల కేంద్రంలోని రోలుగుంటలో నూతనంగా ప్రారంభమైన ఐఐటీ-నీట్ కోచింగ్ క్లాసులు శుక్రవారం గ్రామీణ విద్యార్థుల మధ్య ఎంతో ఆసక్తిని రేకెత్తించాయి. మండలంలోని చుట్టుపక్కల గ్రామాలైన రోలుగుంట, ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు భారీగా హాజరై, క్లాసులు ప్రారంభానికి సంబరం వ్యక్తం చేశారు.మార్చి 29న జరిగిన ఐఐటీ-నీట్ ప్రవేశ పరీక్షలో పాల్గొన్న విద్యార్థులతో పాటు, వివిధ ప్రైవేటు పాఠశాలలు చదువుతున్నవారు మరియు పరీక్షలు రాయని విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో క్లాసులకు హాజరయ్యారు. ఈ క్లాసులు గ్రామీణ విద్యార్థులకు ఉచితంగా అందించబడుతున్నాయి.
కిలాడి సత్యనారాయణ ఐపిఎస్, పోతల ప్రసాద్ నాయుడు, వేదా విద్యా డైరెక్టర్‌ల సహకారంతో భారతదేశంలో ఐఐటీ-నీట్ కోచింగ్‌లో ప్రథమ స్థానాన్ని సాధించిన ఫిజిక్స్ వాలా సంస్థ సౌజన్యంతో ఈ క్లాసులు నిర్వహిస్తున్నారు.దేశవ్యాప్తంగా సుమారు 5 కోట్ల మంది విద్యార్థులకు శిక్షణ అందించిన ఈ సంస్థ, ఇక్కడి విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ అందించనుంది.
8వ, 9వ, 10వ తరగతుల విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్లాసులు రెగ్యులర్‌గా జరుగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అవకాశాలు విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరుస్తాయని వారు అభిప్రాయపడ్డారు.
రోలుగుంటలో నూతనంగా ప్రారంభమైన ఐఐటి నీట్ కోచింగ్ క్లాసులు.
RELATED ARTICLES
