అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జానకిరామపురం నేలతల్లి ప్రకృతి వనరుల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి చిరంజీవి ఆధ్వర్యంలో, ఏ బి సి ఎన్ ఎఫ్ డీపీఎం లచ్చన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా విలేజ్ ఏఓలు మరియు ఏ పి సి ఎన్ ఎఫ్ సిబ్బందికి ప్రకృతి ఆధారిత కషాయాలు, ద్రావణాలు పంటలపై చూపే ప్రభావాన్ని వివరించారు. పలు ద్రావణాల తయారీ విధానాలను ప్రదర్శిస్తూ వాటి ఉపయోగాలను తెలియజేశారు.రైతులకు ఈ ప్రకృతి ద్రావణాలను అందుబాటులో ఉంచి, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఏఓ చిరంజీవి తెలిపారు.కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఏపీ సీఎన్ ఎఫ్ మండల కోఆర్డినేటర్లు మరియు నేలతల్లి ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం యజమాని ఆ. ముసిలి నాయుడు సంతోషం వ్యక్తం చేస్తూ పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
జానకి రాంపురంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం
RELATED ARTICLES
