Friday, June 5, 2026
HomeAndhra Pradeshమహేంద్ర బోలోరో వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ తీవ్రగాయాలు

మహేంద్ర బోలోరో వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ తీవ్రగాయాలు

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం డివిజన్ పరిధిలోని రాజవొమ్మంగి పెట్రోల్ బంకు ఎదురుగా జాతీయ రహదారిపై గురువారం ఉదయం 8.30 సమయంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న మార్తె నూకరాజు దొడ్డంరెడ్డి శ్రీరాములు అనే ఇద్దరు వ్యక్తులు వారు ప్రయాణిస్తున్న రోడ్డుపై ఎదురుగా వస్తున్న బోలోరో వాహనం డీకొన్న ఘటనలో ఇద్దరికీ కుడి కాళ్ళు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదంకు కారణమైన వాహనంలోనే ఇద్దరుని రాజవొమ్మంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక వైద్య సిబ్బంది బూరమ్మ ప్రాథమిక చికిత్స చేసి అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న శ్రీరాములు కుటుంబీకులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి అనంతరం రాజవొమ్మంగి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. క్షతగాత్రుడి కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజవొమ్మంగి సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు తెలిపారు. ప్రమాధానికి కారణమైన వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించామని ఎస్ఐ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular