Friday, June 5, 2026
HomeAndhra Pradeshమీడియా స్వేచ్ఛను హరించాలని చూడటం హేయమైన చర్య, విలేకరి మృతికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలి.!

మీడియా స్వేచ్ఛను హరించాలని చూడటం హేయమైన చర్య, విలేకరి మృతికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలి.!

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా పరిధిలోని వీ.కోటలో మంగళవారం ఉదయం ఓ తెలుగు దిన పత్రిక సంబంధించిన విలేకరిపై జరిగిన దాడిని పోలవరం జిల్లా ఏపీడబ్ల్యూజే యూనియన్ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర ఏపీడబ్ల్యూజే యూనియన్ పిలుపు మేరకు మంగళవారం సాయంత్రం రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండల స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల బృందం చిత్తూరు జిల్లా వి కోటలో పత్రిక విలేకరిపై దాడి చేసి మృతికి కారకులైన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌లో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్రావుకు ఫిర్యాదు పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ విలేఖరిపై దాడి చేసి అన్యాయంగా పొట్టనపెట్టుక్క వారిని విడిచిపెట్టే పరిస్థితి లేదని వారు పేర్కొన్నారు. అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చడనే నెపంతో అక్రమార్కులు అన్యాయంగా విలేఖరిని హతమార్చడం ఎంత వరకు సబబు అని వారు ప్రశ్నించారు. మీడియా స్వేచ్ఛను హరించాలని చూడటం హేయమైన చర్య అని వారు అభివర్ణించారు. జర్నలిస్టు మృతికి కారకులైనవారు ఎంతటివారైనా వారు కాటకాటాలపాలు అయ్యే వరకు బాధితుడి కుటుంబం తరుపున నిలబడి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం పోరాడుతుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజవొమ్మంగి మండల అల్లూరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు ఆరిపాక సూరిబాబు సీనియర్ పాత్రికేయులు పి.వెంకటేశ్వర్లు , టి.వీర్రాజు సభ్యులు ఎస్ రాజు, యు లక్ష్మణ్, కె శ్రీనివాస్, పి సత్యనారాయణ, ఇ శ్రీనుబాబు, ఆలీ, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular