Thursday, April 16, 2026
HomeUncategorizedశివరాత్రి పండుగకు ముందే కొత్తకోట బీఎన్ రోడ్డు పూర్తి చేస్తాం జనసేన ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు.

శివరాత్రి పండుగకు ముందే కొత్తకోట బీఎన్ రోడ్డు పూర్తి చేస్తాం జనసేన ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు.

శివరాత్రి పండుగకు ముందే కొత్తకోట బీఎన్ రోడ్డు పూర్తి చేస్తాం జనసేన ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు.

నర్సీపట్నం రూరల్ జిల్లా వాణి ప్రతినిధి.

అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం. ప్రజల సౌకర్యం, భక్తుల సౌకర్యం కోసం చొరవ చేసుకుని నడిచిన చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు కొత్తకోట గ్రామంలో బీఎన్ రోడ్డు నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఫిబ్రవరి 15 న ఘనంగా మహా శివరాత్రి కళ్యాణపూజలకు ఈ రోడ్డు ప్రధాన మార్గంగా ఉండటంతో, పండుగకు ముందే పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఉదయం స్వయంగా రోడ్డు పనులు జరిగే స్థలానికి చేరుకున్న రాజు, పనుల పురోగతి, నాణ్యతను పరిశీలించారు. కాంట్రాక్టర్తో మాట్లాడుతూ, “శివరాత్రి రోజు భక్తులు, గ్రామస్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు. త్వరితగతిలో పనులు పూర్తి చేయండి. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దు.ఇది ప్రజల హక్కు, మా బాధ్యత” అని స్పష్టం చేశారు. ఈ రోడ్డు పూర్తయ్యాక కళ్యాణపూజలకు వెళ్లే భక్తులు, స్థానికుల సౌకర్యం మరింత మెరుగవుతుందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, పార్టీ నాయకత్వం ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చురుకుగా ఉందని చూపారు. ఇలాంటి ఆచరణాత్మక చర్యలతో జనసేన పార్టీ చోడవరం ప్రాంతంలో ప్రజల హృదయాల్లో మరింత దగ్గరవుతూ, అభివృద్ధికి కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular