Friday, June 5, 2026
HomeAndhra Pradeshబాధ్యతాయుతంగా భరోసా పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే, ఇంటింటికి వెళ్లి మరి యోగక్షేమాలు అడిగిన: శిరీష దేవి

బాధ్యతాయుతంగా భరోసా పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే, ఇంటింటికి వెళ్లి మరి యోగక్షేమాలు అడిగిన: శిరీష దేవి

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ప్రతి నెల ప్రతిష్టాత్మకంగా పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఓ మహోద్యమంలా నిర్వహిస్తూ అర్హులైన అందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేయడం జరుగుతుందని రంపచోడవరం శాసనసభ్యురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ ఛైర్పర్సన్ మిరియాల శిరీష దేవి పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా తరువాత ఎటువంటి తాత్సారం లేకుండా సామాజిక పింఛన్లు అందజేస్తున్నామని ఎమ్మెల్యే వాపోయారు. మే నెల 1 శుక్రవారం ఉదయం రాజవొమ్మంగి మండలంలోని సింగంపల్లి గ్రామంలో స్థానిక తెదేపా జనసేనా బీజేపీ నాయకులు కార్యకర్తల సంయుక్త ఆధ్వర్యంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె పేర్కొన్నారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఆమెకు గ్రామస్తులు హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈక్రమంలో ఆమె ప్రతీ ఇంటి ఇంటికి నేరుగా వెళ్లి పింఛన్లు లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ప్రజా దర్బార్ పేరిట గ్రామాల్లోని ఇంటి ఇంటికి వెళ్లి మౌళిక సదుపాయాలు ఎలా ఉన్నాయో అక్కడున్న వారికి అడిగి తెలుసుకున్నరు. అంతేకాకుండా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అడిగి తెలుసుకున్నరు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, దీర్ఘకాలిక రుగ్మతలకు సంబంధించిన సామాజిక పింఛన్ల పంపిణీలో రాజీ లేకుండా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అందజేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. త్వరలోనే అర్హులైన పింఛన్దారులకు రాష్ట్ర వ్యాప్తంగా నూతన పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు
ఈకార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి లోకుల యాదగిరీశ్వర రావు మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ దొర కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular