Friday, June 5, 2026
HomeUncategorizedఅనుమతులు లేకుండా బాణాసంచా తయారు చేసినా, అమ్మినా కఠిన చర్యలు: అధికారుల హెచ్చరిక

అనుమతులు లేకుండా బాణాసంచా తయారు చేసినా, అమ్మినా కఠిన చర్యలు: అధికారుల హెచ్చరిక

​జగ్గంపేట, మే 26: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ముందస్తు అనుమతులు లేకుండా బాణాసంచా తయారు చేసినా లేదా విక్రయించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జగ్గంపేట సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) టి.రఘునాథరావు స్పష్టం చేశారు. ​మంగళవారం జగ్గంపేట శివారు ప్రాంతమైన మాట్లగుంట వద్ద ఉన్న బాణాసంచా తయారీ కేంద్రాన్ని జగ్గంపేట తహసిల్దార్ రమేష్, ఎస్సై రఘునాధరావు సంయుక్తంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పెద్దాపురం లేబర్ ఆఫీసర్‌తో పాటు జగ్గంపేట అగ్నిమాపక సిబ్బంది కూడా పాల్గొన్నారు. తయారీ కేంద్రంలో భద్రతా ప్రమాణాలను, నిల్వలను వారు నిశితంగా పరిశీలించారు.
​”ప్రస్తుతం ఎక్కడా బాణాసంచా తయారీకి కానీ, అమ్మకాలకు కానీ ఎలాంటి అనుమతులు లేవు. ప్రభుత్వ అధికారిక ఆదేశాలు వచ్చేంతవరకు ఎవరూ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదు.”— అధికారుల ఉమ్మడి ప్రకటన
​నిబంధనలు ఉల్లంఘిస్తే సీరియస్, ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి రహస్యంగా బాణాసంచా తయారు చేసినా, నిల్వ ఉంచినా లేదా విక్రయాలు జరిపినా చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై రఘునాథరావు ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న విషయమైనందున ప్రతి ఒక్కరూ నిబంధనలకు కట్టుబడి ఉండాలని తహసిల్దార్ రమేష్ సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular