
పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: రాజవొమ్మంగి మండలం జడ్డంగి మాడేరు వాగు సమీపంలో ఉన్న శ్రీశ్రీశ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి ఆలయం వద్ద ఈ నెల 15వ తేదీ నుండి జరగనున్న మహాశివరాత్రి వేడుక సందర్భంగా ఉత్సవాల నిర్వహణ, సంబంధించి అన్ని ఏర్పాట్లు రాజవొమ్మంగి మండల తహశీల్దార్ అల్లు సత్యనారాయణ బుధవారం పరిశీలించారు. స్థానిక ఆలయ కమిటీ సభ్యులతో శివరాత్రి ఏర్పాట్లుపై చర్చించారు. మహా శివరాత్రి ఉత్సవాలు జయప్రదంగా జరిగేందుకు అందరూ సమన్వయంగా పనిచేయాలని తహశీల్దార్ సూసించారు. ఇదే క్రమంలో ట్రాఫిక్ క్యూలైన్లు మరుగుదొడ్లు శానిటేషన్ త్రాగునీరు భోజన ఏర్పాట్లు సిసి కెమెరాలు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణకు సంబంధిత విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు మరియు స్థానిక శ్రీశ్రీశ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
