జిల్లా వాణి ప్రతినిధి: కాకినాడ జిల్లా ఎస్పీ G. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా జూద క్రీడలపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో గురువారం జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో జగ్గంపేట ఎస్సై శ్రీ రఘు నందన్ రావు మరియు వారి సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా ముగ్గురు (3) పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 6200/- రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ YRK మాట్లాడుతూ.. జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండలాల్లో ఎవరైనా చట్టవిరుద్ధంగా జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా నిరంతరం నిఘా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

