జిల్లా వాణి ప్రతినిధి: కాకినాడ జిల్లా జగ్గంపేట రహదారి నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణ రక్షణ సాధ్యమని జగ్గంపేట ఎస్సై టి.రఘునాధరావు పేర్కొన్నారు. గురువారం జగ్గంపేట ప్రధాన సెంటర్‌లో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న పలువురు వాహనదారులపై కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించారు. వాహనదారులు ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కారు నడిపే వారు, ముందు సీట్లో కూర్చునే వారు తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాలి. వాహనానికి సంబంధించిన లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలను వెంట ఉంచుకోవాలి. “రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలి.” – టి.రఘునాధరావు, ఎస్సై. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

