

పోలవరం జిల్లావాణి ప్రతినిధి :కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు గురువారం సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజవొమ్మంగి చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం అయింది.సమ్మె నేపథ్యంలో కార్మికులు స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి అల్లూరి జంక్షన్ మీదుగా గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సిఐటియు మండల కన్వీనర్ టి శ్రీనివాస్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు,గిరిజన సంఘం ఇతర ప్రజాసంఘాల నాయకులు అశోక్,కె సూరిబాబు,కె వెంకట లక్ష్మీ,ఎం రమేష్,ఎస్ అచ్చారావు అమ్మిరాజు, రాజ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల వలన నష్టం,సమ్మె నేపద్యం వివరించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, కార్మికుల చట్టాలు, హక్కుల పరిరక్షణకు భవిష్యత్ ఉద్యమాలకు కార్మికుల సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ,ఆశ,మిడ్ డే మీల్స్,భవననిర్మాణం, పంచాయితీ,విఓఏ తదితర రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
