
పోలవరం జిల్లావాణి ప్రతినిధి: నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు స్పష్టమైన దశ, దిశను చూపే విధంగా మునుపెన్నడూ లేనంత విదంగా రాష్ట్ర ఆర్ధిక బడ్జెట్ ను ఎన్డీయే కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందని రంపచోడవరం శాసనసభ్యురాలు ఆంద్రప్రదేశ్ గిరిజన సంక్షేమ కమిటి చైర్పర్సన్ మిరియాల శిరీషదేవి ఆదివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే శిరీష దేవి రాష్ట్ర ఆర్ధిక బడ్జెట్ పై ఈ క్రింద విదంగా స్పందించారు. రాష్ట్ర అభివృద్ధికి తోర్పడే అన్నిప్రయోజనాలు, ముఖ్యంగా ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ప్రజా శ్రేయస్సు అనుసంధానం కోసం ఈ బడ్జెట్ ఎంతగానో తొర్పడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బడుగు బలహీనవర్గాల అభివృద్దే లక్ష్యంగా వ్యవసాయం, పారిశ్రామిక, సాగునీటి, విద్య, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం రంగాలను బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని, ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ ను అభినందిస్తున్నామని శిరీష దేవి అన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ఇదివరకు ఎప్పుడు ప్రవేశ పెట్టానంత రూ.53,915 కోట్లు ఆర్ధిక బడ్జెట్ కేటాయించడం గమనార్హం అని ఎమ్మెల్యే శిరీష దేవి పేర్కొన్నారు.
