Thursday, April 16, 2026
HomeUncategorizedఅగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి నిత్యవసరాలు పంపిణీ

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి నిత్యవసరాలు పంపిణీ

రాజమహేంద్రవరం రూరల్, ఫిబ్రవరి 18 : కాతేరు గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో బాధితుడైన గ్రామ నివాసి మద్దా నూతియ్యను పరామర్శించేందుకు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కాశి నవీన్ కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి, వారికి నిత్యావసర సరుకులు, గ్యాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా నిలబడుతుందన్నారు. ఇలాంటి కష్టకాలంలో బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దా మణి, బేరి హర్షవర్ధన్, మెట్టపల్లి వెంకట్, తిరుమల విద్యాసంస్థల తరపున నున్న కృష్ణ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular