
పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం మండలం ముసురుమిల్లి సచివాలయంలో రెవిన్యూ గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎంపీటీసీ కుంజం వంశి మాట్లాడుతూ గతంలో పంచాయతిలో ఉన్న కొన్ని గ్రామాలు రిసర్వే పూర్తి అయ్యాందని చిన్న భారంగి లో గ్రామంలో ఈ వారం రోజులలో మొదలు పెడతామని అన్నారు. ఈ అవకాశాన్నీ రైతులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఎంపీటీసీ కోరారు. గత ప్రభుత్వంలో అన్నీ సర్వేలు పూర్తియ్యన గ్రామాలకు ఉన్నత అధికారులు దృష్టిలో పెట్టి వారికీ పాసు పుస్తకాలు వచ్చేలా చూడాలని వంశీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసా చట్టం ఉప అధ్యక్షులు విక నాగేశ్వరరావు, పిసా కార్యదర్శి శివశంకర్ రెడ్డి, విఆర్వో ప్రభావతి, పంచాయతి కార్యదర్శి రాంబాబు, సర్వయర్ దేవా, బొబ్బా శేఖర్, కారం సంకురు దొర తదితరులు పాలొగొన్నారు.
