

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోనీ రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామ శివారు ప్రాంతం జాతీయ రహదారికి అనుకోని ఉన్న మడేరువాగు అయకట్టు వద్ద శుక్రవారం ఉదయం కారు బోల్తా పడిన ఘటన స్థలం వద్ద ఐదుగురుకి తీవ్ర గాయాలు కాగా ఓ మహిళా పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందరు. వీరు అంతా రాజవొమ్మంగి మండలంలోని కొండపల్లి గ్రామానికి చెందిన వారు, కుటుంబ సభ్యులoత అన్నవరం గ్రామంలోని ఓ వివాహ కార్యక్రమానికి హాజరై రాత్రి తిరుగివస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈవిషయం తెలుసుకున్న స్థానిక జడ్డంగి పోలీసు స్టేషన్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని గాయపడినవారిని జడ్డంగి ప్రభుత్వకి తరలించారు.
