Thursday, April 16, 2026
HomeUncategorizedచెట్టుపల్లి లో లేక దూడల ప్రదర్శన.

చెట్టుపల్లి లో లేక దూడల ప్రదర్శన.

చెట్టుపల్లిలో లేగ దూడల ప్రదర్శన

నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో పశువుల ఆసుపత్రి ఆవరణలో లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం కూటమి నాయకుల చేతుల మీదుగా పశు వైద్య బృందం సమక్షంలో ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమం గూర్చి కూటమి నాయకులు మాట్లాడుతూ గ్రామాలలో వ్యవసాయంతో పాటు పాడి పశువుల పోషణలోనే ఎక్కువమంది జీవనాధారం సాగిస్తూ ఉంటారు పశువుల పోషణలో మెలకువలు వ్యాధి నిరోధక టీకాలు ఆయా వయసులను బట్టి పోషకాహారం ఏ విధంగా అందించాలి ఇత్యాది విషయాలపై పశు వైద్య నిపుణులు అందించిన సలహాలు సూచనలు పాటించాలని ,పశు వైద్య ఉన్నతాధికారి మాట్లాడుతూ స్పీకర్స్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి ఆదేశానుసారం నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో లేగ దూడల ప్రదర్శన లో ఆహ్లాదకరమైన పోటీ తత్వం పెంచేటందుకు ఆరోగ్యవంతమైన లేగ దూడలను ఎంపిక చేసి ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు గ్రామ పెద్దల చేతుల మీదుగా అందజేయడం జరిగిందని ఈ కార్యక్రమమునకు విచ్చేసినటువంటి ప్రతి పాడి రైతుకి ప్రోత్సాహక బహుమతి తో పాటు నులిపురుగుల మందు ఉచితంగా అందజేయడం జరిగిందని పశు పోషణలో పశు వైద్యాధికారి సలహాలు పాటిస్తూ మరింత ఆదాయం లభించేలాగా రైతులు ప్రయత్నం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన రూరల్ ఉపాధ్యక్షుడు ఊడి చక్రవర్తి, గ్రామ సర్పంచ్ గజాల సూరిబాబు, వైస్ ఎంపీపీ ఎన్నం రమణ, మట్ట సతీష్, మోపాడ సత్యప్రసాద్, పశు వైద్య శాఖ అధికారులు సిబ్బందితోపాటుగా పాడి రైతులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular