

కొవ్వూరు గ్రామంలో అంగరంగ వైభవంగా తీర్థ మహోత్సవం-21 అనకాపల్లిమీ 24 న్యూస్, ఫిబ్రవరిజిల్లా రోలుగుంట మండలం కొవ్వూరుగ్రామంలో గౌరీ పరమేశ్వరులు తీర్థమహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభం20යි. శనివారం ఉదయం పగటివేషాలతో ప్రారంభమై సాయంత్రం గౌరీపరమేశ్వరులు తీయుట, రాత్రి 9 గంటలకువెంకటేశ్వర నాట్యమండలి వారిచే సామ్రాట్అశోక్ అనే నాటకం ప్రదర్శించబడుతుంది.ఆదివారం ఉదయం నుంచి తీర్థ మహోత్సవకార్యక్రమం ప్రారంభమై రాత్రికి డాన్స్ బేబీ డాన్స్ మరియు అనేక సాంస్కృతిక కార్యక్రమాలునిర్వహించబడతాయని గ్రామ సర్పంచ్ కాంతమ్మ రాజారావులు తెలిపారు. గ్రామ పెద్దలసమక్షంలో, యువకులు, మహిళలు, పిల్లలు ఈ పండగ మహోత్సవంలో పాల్గొంటారు.సోమవారం గౌరీ పరమేశ్వరులు నిమజ్జన కార్యక్రమంతో ఉత్సవం ముగుస్తుంది. అనంతరంమంగళవారం శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద భారీ అన్న సమారాధనకార్యక్రమం నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు.
