
కొవ్వూరు గ్రామంలో అంగరంగ వైభవంగా తీర్థ మహోత్సవం
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో గౌరీ పరమేశ్వరులు తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభం 20 నుండి. శనివారం ఉదయం పగటి వేషాలతో ప్రారంభమై సాయంత్రం గౌరీ పరమేశ్వరులు తీయుట, రాత్రి 9 గంటలకు వెంకటేశ్వర నాట్యమండలి వారిచే సామ్రాట్అ శోక్ అనే నాటకం ప్రదర్శించబడుతుంది.ఆదివారం ఉదయం నుంచి తీర్థ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమై రాత్రికి డాన్స్ బేబీ డాన్స్ మరియు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని గ్రామ సర్పంచ్ కాంతమ్మ రాజారావులు తెలిపారు. గ్రామ పెద్దల సమక్షంలో, యువకులు, మహిళలు, పిల్లలు ఈ పండగ మహోత్సవంలో పాల్గొంటారు.సోమవారం గౌరీ పరమేశ్వరులు నిమజ్జన కార్యక్రమంతో ఉత్సవం ముగుస్తుంది. అనంతరం మంగళవారం శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు.
