పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఉమ్మడి అల్లూరి పోలవరం జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు, రంపచోడవరం డివిజనల్ డిఎస్పీ జీఎస్ సాయి ప్రశాంత్ , రాజవొమ్మంగి సీఐ గౌరీ శంకర్ సూచనలు మేరకు మేరకు శుక్రవారం రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు జాతీయ రహదారి నియమ నిబంధనలు తెలియకపోవడంతో, రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయనీ ఆయన వాపోయారు. ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను తుచ తప్పకుండా పాటించి సురక్షిత ప్రయాణాలు చేయాలని ఎస్ఐ శివకుమార్ ప్రజలను కోరారు.
సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు
RELATED ARTICLES
