
నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో కూటమి నాయకులు ఆధ్వర్యంలో కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వారి నిర్వహణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమం ఉద్దేశించి జనసేన విశాఖ రూరల్ ఉపాధ్యక్షుడు చక్రవర్తి గ్రామ సర్పంచ్ గజాల సూరిబాబు మాట్లాడుతూ చెట్టుపల్లి మరియు పరిసర ప్రాంత ప్రజలు 240 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారని వీరిలో 26 మంది వరకు ఆపరేషన్ పడుతుందని వీరిని అందరినీ కూడా మరిన్ని కంటి పరీక్షల నిమిత్తం నర్సీపట్నంలో ఉన్నటువంటి కిరణ్ కంటి ఆసుపత్రి వద్ద అన్ని పరీక్షలు చేసి ఉచితంగా కంటి అద్దాలు అందించడమే కాకుండా ఆపరేషన్ పడిన వారికి కాకినాడ కిరణ్ ఆసుపత్రి వద్ద ఆపరేషన్ చేయించి మరి వారి వారి ఇళ్ల వద్ద దించుతారని మా కూటమి నాయకుల తరఫున కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వారి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మాకు సహకరించిన చెట్టుపల్లి సచివాలయ సిబ్బందికి నర్సీపట్నం కిరణ్ కంటి ఆసుపత్రి బ్రాంచ్ ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వైస్ ఎంపీపీ ఈన్నం రమణ, మోపాడు సత్యప్రసాద్, పసుపులేటి అప్పలనాయుడు, కలిమి సత్తిబాబు నర్సీపట్నం కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది తో పాటుగా కాకినాడ కిరణ్ ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
