పెందుర్తి జిల్లావాణి ప్రతినిధి:
విశాఖ జిల్లా, పెందుర్తి మండలం, జీవీఎంసీ 95 వ వార్డు పురుషోత్తపురం హెచ్ బి కాలనీ రాజయోగ మెడిటేషన్ కేంద్రం నందు 90వ త్రిమూర్తి శివజయంతి మహోత్సవం సాంప్రదాయబద్ధంగా జరిగాయి…ఈ కార్యక్రమానికి అతిథులుగా కార్పొరేటర్ ముమ్మన దేవుడు,,బిజెపి పెందుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ గొర్ల రామునాయుడు,,మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నాదెళ్ల జ్యోతి,,, ఎస్ ఐ లక్ష్మి హాజరై, పూజలు నిర్వహించి, ఈశ్వరియ పతాకావిష్కరణ గావించి, ప్రమాణాలు చేసి జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలను ఆరంభించారు… అనంతరం ఇక్కడ జరిగిన సభలో అతిధిలు ప్రసంగిస్తూ, ప్రస్తుత జీవన విధానానికి, ఆధ్యాత్మిక చింతన ఎంత అవసరమో,, ధ్యానం యోగాలు అంతే అవసరమని పేర్కొన్నారు…మంచి వ్యక్తి నిర్మాణం, తద్వారా ఉత్తమ సమాజ స్థాపనకు ఇవి ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు…ఆ దిశగా ప్రజలను నడిపిస్తున్న బ్రహ్మకుమారిస్ నీ అభినందించారు…కార్యక్రమంలో బ్రహ్మ కుమారీస్ మాట్లాడుతూ,, అందరికీ ఆమోదయోగమయ్యే,, రీతిలోనే తాము రాజా యోగ బోధన సాగుతుందని,,దీనితో ప్రతి మనిషి తన దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలను చక్కగా పరిష్కరించుకోగలరని తెలిపారు…ఈ కార్యక్రమంలో హెచ్ బి కాలనీ నాయకులు పివిఆర్ మూర్తి,,
విశ్వేశ్వర కాలనీ నాయకులు,, సత్యనారాయణ,,ఈశ్వరియ విశ్వవిద్యాలయం ప్రతినిధులు బ్రహ్మకుమారిస్,,,బికెసత్యవతి,,, బికె రూప,,,బికె పావని,,,బికె దివ్య,,,బికె శాంతి,,,సంఘం ప్రతినిధులు,,మూర్తి,,,ఈశ్వరచంద్ర వెంకట్రావు,,,తదితరులు పాల్గొన్నారు…
సాంప్రదాయ బద్ధంగా కొనసాగిన 90వ త్రిమూర్తి శివజయంతోత్సవాల.
RELATED ARTICLES
