జిల్లావాణి ప్రతినిధి :దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అనంతబాబు తన వద్ద డ్రైవర్ గా పనిచేసిన వీధి సుబ్రమణ్యాన్ని మర్డర్ చేసిన అనంతరం ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లుగా సృష్టిస్తూ మృత దేహాన్ని నేరుగా ఇంటికి మృతుడి తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన కేసు యావత్తు తెలుగు రాష్ట్రాల్లో రేకెత్తించిన విషయం తెలిసిందే! ఈకేసులో నేరస్థుడిగా ఉన్న అనంతబాబుకు పరోక్షంగా సహకరించి కొమ్ముకసారన్న ఆరోపణలపై నలుగురు పోలీస్ అధికారుల పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసులో పోలీసులు కుమ్మక్కు అయ్యారంటూ సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజా నలుగురిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం హయాంలో అప్పటి కాకినాడ డీఎస్పీ, ప్రస్తుతం భీమవరం అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న వి.భీమారావు, వెయిటింగ్లో ఉన్న డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, అప్పట్లో సర్పవరం సీఐగా పనిచేసిన ఆకుల మురళీకృష్ణ, సర్పవరం స్టేషన్ ఎస్ఐగా ఉండి, ప్రస్తుతం కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎన్.సతీష్ బాబు సస్పెండైన వారిలో ఉన్నారు.
కొమ్ముకాసరన్న ఆరోపణల నేపథ్యంలో ఖాకీలపై వేటు
RELATED ARTICLES
