Thursday, April 16, 2026
HomeAndhra Pradeshఊర్లకులపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి సుడిగాలి పర్యటన, ఇటీవలే...

ఊర్లకులపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి సుడిగాలి పర్యటన, ఇటీవలే అంతుచిక్కని వ్యాధులతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు పరామర్శ

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలో లోతట్టు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా చెడ్డంగి గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించించి విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక వంట షెడ్డు మరుగుదొడ్లు తనిఖీ చేశారు. విద్యార్థులకు వండిపెట్టే నిత్యవసర సరుకుల స్టాక్ రూమ్ని పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఉర్లకులపాడు గ్రామంలోని గత కొన్ని రోజులుగా అంతుచిక్కని వ్యాధులతో మృత్యువాత పడిన కుటుంబ సభ్యులను కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పరామర్శించి, మృతికి గల కారణాలపై ఆయన ఆరా తీశారు. ఈ క్రమంలో అక్కడున్న ప్రజలు గ్రామంలోని మంచినీటి బోరు బావులలోని నీరు ఎర్రని రంగులో వస్తుందని ఆనీరు త్రాగేందుకు చాలా విబ్బందులు పడుతున్నామని ఆయన వద్ద వారు వాపోయా రు. దానివల్ల ఏమైనా కిడ్నీ వ్యాధిలకు బారిన పడుతున్నామేమొనని ఆయన వద్ద సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్నా జడ్డంగీ మెడికల్ సిబ్బందిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వారు నమూనాలను అధ్యయనం చేసేందుకు లాబ్ పంపినట్లుగా సిబ్బంది పేర్కొన్నారు. ఈసందర్భంగా మరోసారి ఇటువంటి సమస్యలు తలెత్తకుండా పరిష్కరించాలని వారిని ఆదేశించారు. గ్రామంలోని రెండు మంచినీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరారు. దీనిపై స్పందించిన ఆయన అధిష్టానంతో మాట్లాడి ఆరో ప్లాంట్లో ఏర్పాటుకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఇటీవలే చనిపోయిన ఓ కుటుంబా వ్యాజమని సభ్యులకు తన వంతు ఆర్థిక సాయంగా 5000 రూపాయలు అందజేశారు. తదనంతరం జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును బొజ్జిరెడ్డి రెడ్డి సందర్శించారు. వైద్య పరీక్షలకు అక్కడకు వచ్చినవారిని ఆరోగ్య సమస్యల పై వైద్య పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకొని క్రమం తప్పకుండా మందులు వాడాలని ఆయన సూచించారు. అనంతరం బర్నగూడెం ఆశ్రమ ఉన్నత పాఠశాలలోనే మధ్యాహ్నం భోజనాలను పరిశీలించి విద్యార్థులకు భోజనం వడ్డించారు. విద్యార్థులకు భోజనాలు ఏవిధంగా ఉంటున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన వద్దకు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తంటా అదిరాజు మాజీ జడ్పీటీసీ కోసూరి బుజ్జి చిన్నాలమ్మ , మాజీ సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతరావు , హిందూ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డీవిఎస్ ప్రసాద్, రాజవొమ్మంగి టీడీపీ ప్రధాన కార్యదర్శి వాసంసెట్టి గంగాధర్ మాజీ బీజేపీ మండల అధ్యక్షుడు తాము సూరిబాబు మరియు వైద్య, ఆరోగ్య శాఖకు రెవెన్యూ ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు అక్కడ హాజరయ్యారు. కమిషన్ చైర్మన్ పర్యటన నేపథ్యంలో జడ్డంగీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular