HomeAndhra Pradeshగంజాయి తరలిస్తున్న వ్యక్తినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు

గంజాయి తరలిస్తున్న వ్యక్తినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఉమ్మడి అల్లూరి, పోలవరం జిల్లాల ఎస్పీ అమిత్ బర్దర్ , రంపచోడవరం డివిజనల్ డిఎస్పీ జి సాయి ప్రశాంత్ ఆదేశాల మేరకు గంజాయి నిర్మూలనే ధ్యేయంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూన్నారు. ఈ మేరకు రాజవొమ్మంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరీ శంకర్ నేతృత్వంలో వారికి రాబడిన విశ్వనీయ సమాచారం మేరకు సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో కిండ్ర అడ్డురోడ్డు సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తూఉండగా ఒడిస్సా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లా చిత్రకొండ మెట్టగూడ గ్రామనికి చెందిన లైచ్చన ఖారా అనే వ్యక్తి మారుతి జెన్ కారులో 100 కేజీలు గంజాయి నీ గుట్టుచప్పుడు లేకుండా ఒడిశా రాష్ట్రం నుండి రాజమండ్రికి గంజా యి తరలిస్తున్నా క్రమంలో ఎస్ఐ శివ కుమార్ మాటు వేసి గంజాయి తో ఓక వ్యక్తినీ కారును స్వాధీనం చేసుకున్నా రు. గంజాయి తరలిస్తు న్న వారిలో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular