పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు, అది కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం సమీపానికి వచ్చిందని కొందరు ఆకతాయిల వ్యక్తులు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ద్వారా తయారు చేసిన ఫోటోలను సామాజిక మాధ్యమాలు మరియు వివిధ వాట్సాప్ గ్రూపులలో ప్రచారం చేస్తున్నారని ఆలయ అధికారుల దృష్టికి వెళ్ళడంతో ఈ విషయంపై ఆలయ అధికారులు , ఆలయ విజిలెన్స్ విభాగం వారు సమగ్రంగా పరిశీలించగా, ఆలయం పరిసర ప్రాంతాలలో ఎటువంటి పులి కదలికలు గానీ, ప్రమాదకర పరిస్థితులు గానీ లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆలయం వద్ద భక్తుల భద్రతకు ఎలాంటి ముప్పు లేదనీ పేర్కొన్నారు. అయినప్పటికీ, ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు తలెత్తకుండా మరియు పూర్తిస్థాయి జాగ్రత్త చర్యలలో భాగంగా, తిరుపతి నుండి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పగలు మరియు రాత్రి వేళల్లో ఆలయ పరిసర ప్రాంతాలలో విజిలెన్స్ సిబ్బంది నిరంతరం రౌండ్స్ నిర్వహిస్తూ పరిస్థితిని పర్యవేక్షించమని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు, భక్తులు ఎవరూ కూడా నిర్ధారణ లేనపోనీ వాస్తవాల సోషల్ మీడియాలోనీ వార్తలు, ఫోటోలు, వీడియోలను నమ్మవద్దని ఆలయ కమిటీ వారు కోరారు. ఇదే క్రమంలో తప్పుడు ప్రచారం షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారిక సమాచారం కోసం మాత్రమే ఆలయ అధికారుల ప్రకటనలను విశ్వసించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ గోవింద గిరి రంపచోడవరం కో-ఆర్డినేటర్ నల్లమిల్లి వేంకటరామారెడ్డి స్పష్టం చేశారు.
తూచ్ అంతా ఉత్తిదే, అక్కడ ఏమిలేదు
RELATED ARTICLES
