Thursday, April 16, 2026
HomeUncategorizedరామచంద్రపురంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం

రామచంద్రపురంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం

,ఫిబ్రవరి 26:కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. జనసేన నాయకులు తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో, సర్పంచ్ తుమ్మలపల్లి సాయి గుణశేఖర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సాయి గుణశేఖర్ తన సభ్యత్వాన్ని నమోదు చేసుకోగా, గురువారం ఒకే రోజు మొత్తం 50 మందికి సభ్యత్వ నమోదు పూర్తి చేశారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ.. ఇది కేవలం రాజకీయ సభ్యత్వం మాత్రమే కాదని, కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇచ్చే కార్యక్రమమని పేర్కొన్నారు. కార్యకర్త చెల్లించే 400 రూపాయలకు, పవన్ కళ్యాణ్ గారు మరో 1600 రూపాయలు జోడించి, మొత్తం 2,000 రూపాయలతో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారని ఆయన వివరించారు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఈ బీమా సదరు కుటుంబాన్ని ఆదుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular