Thursday, April 16, 2026
HomeUncategorized10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కోటనందూరు సబ్‌ఇన్‌స్పెక్టర్ టి. రామకృష్ణ అవగాహన కార్యక్రమం

10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కోటనందూరు సబ్‌ఇన్‌స్పెక్టర్ టి. రామకృష్ణ అవగాహన కార్యక్రమం

కోటనందూరు జిల్లా వాణి ప్రతినిధి

అల్లపూడి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కోటనందూరు ఎస్సై టి రామకృష్ణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు క్రమశిక్షణ, చదువుపై ఏకాగ్రత, మంచి స్నేహితుల ఎంపిక, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, రోడ్డు భద్రతా నియమాలు మరియు చట్టాలపై ప్రాథమిక అవగాహన గురించి తగు సూచనలు చేశారు. భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని కృషి చేస్తేనే విజయం సాధ్యమని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో అల్లీపూడి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు , లైలా కాలేజీ ప్రిన్సిపాల్ రామకృష్ణ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా స్వీకరించారు.
కోటనందూరు పోలీస్ స్టేషన్ తరఫున ఇటువంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular