జగ్గంపేట/గండేపల్లి, ఫిబ్రవరి 28: జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. శనివారం స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ అధ్యక్షతన క్రియాశీలక సభ్యత్వ సాధక్‌లతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ఆయన దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు సమయంలో యాప్‌లో ఎదురవుతున్న టెక్నికల్ ఇబ్బందులపై సాధకులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే సహాయం అందించేందుకు పార్టీ ఐటీ టీం నిరంతరం అందుబాటులో ఉంటుందని తుమ్మలపల్లి రమేష్ భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అత్యధిక సభ్యత్వాలను నమోదు చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, సాధక్‌లు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత ఏడాది సభ్యత్వం తీసుకున్న వారిని రెన్యువల్ చేయడంతో పాటు, పెద్ద ఎత్తున కొత్త సభ్యులను పార్టీలోకి ఆహ్వానించి క్రియాశీలక సభ్యులుగా చేర్పించాలని రమేష్ పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షించడానికి పార్టీ కార్యాలయం నుండి ఒక ప్రత్యేక బృందం పనిచేస్తుందని, ప్రతి మండలం మరియు గ్రామం వారీగా నమోదవుతున్న సభ్యత్వాల స్టేటస్‌ను ప్రతిరోజూ నిశితంగా గమనిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.”ప్రతి సాధక్ ఒక బాధ్యతగా తీసుకుని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. గతంతో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు కావాలి.” – తుమ్మలపల్లి రమేష్ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన సుమారు వందమంది క్రియాశీలక సాధక్‌లు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

