Saturday, April 18, 2026
HomeAndhra Pradeshవైసీపీ నేత ఆదిరాజు మాట్లాడే తీరు అత్యంత ఆసియాస్పదంగా ఉంది: మాజీ జడ్పిటిసి

వైసీపీ నేత ఆదిరాజు మాట్లాడే తీరు అత్యంత ఆసియాస్పదంగా ఉంది: మాజీ జడ్పిటిసి

పోలవరం జిల్లా వాణి ప్రతినిధి: రాజవొమ్మంగి మండలం మారేడుబాక గ్రామపంచాయతీ పరిధిలోని ఉన్న అన్ని గ్రామాల్లో తమ ప్రభుత్వ హయాంలోనే సంక్షేమం అభివృద్ధి జరిగిందని తెదేపా పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, రాజవొమ్మంగి మాజీ జడ్పీటీసీ కోసూరి బుజ్జిచిన్నాలమ్మ అన్నారు. ఈ సందర్భంగా మీడియా ద్వారా తాను జెడ్పీటీసీ ఉన్న సమయంలో గ్రామాల్లో చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు తన సొంత గ్రామ పంచాయతీకి లబ్ది చేకూరిందే తప్ప వైసీపీ ప్రభుత్వం ద్వారా గాని, ఆ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులుగానీ రాజాకియా నాయకుల వల్ల గానీ ఉద్ధరించింది ఏమి లేదని బుజ్జి చిన్నలమ్మ పేర్కొన్నారు. అంతేకాకుండా తన హయాంలో జరిగిన అభివృద్ధిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ జడ్పీటీసీ పేర్కొన్నారు. తనను ఉద్దేశించి విమర్శలు చేసిన ఆదిరాజు తన రాజకీయ చరిత్రను ఒకసారి ఒక్క గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతూ పూట కొక్క పార్టీదగ్గర పబ్బం గడిపూతూ ఒక్కచోట నిలకడగా ఉండాలేని ఆదిరాజు తన కోసం మాట్లాడే ముందు ఒక్కసారి సర్పంచ్ కాకముందు తన రాజకీయ నేపధ్యం ఏమిటో గుర్తు చేసుకోవాలని కోరారు. నీరాజకీయ చరిత్ర అందరికీ తెలుసునని ఆమె అన్నారు. ఆదిరాజు తనకోసం మాట్లాడటం అత్యంత హాస్యాస్పదంగా ఉండదన్నారు. తాను ప్రాతినిధ్యం వహించిన సమయంలో అభివృద్ధి ఉరకలు వేసిందని బుజ్జి చిన్నాలమ్మ చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో తాను ప్రస్తుతం ఎటువంటి రాజ్యాంగ బద్దమైన పదవిలో లేకపోయిన ప్పటికీ తమపార్టీ శాసన సభ్యురాలు మిరియాల శిరీష దేవి నేతృత్వంలో గ్రామపంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం కోతల ప్రభుత్వం కాదని కేవలం చేతల ప్రభుత్వమని ఆమె పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరా లు గ్రామపంచాయతీలో ఏఒక్క చోట కూడా చిన్న అభివృద్ధి పని కూడా చేయలేదని, గ్రామంలోని కాదు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ అభివృద్ధి జరగలేదన్నారు. ఏవంక లేనివాళ్లు డొంకట్టుకొని మాట్లాడినట్టుగా ఈ వైసీపీకి చెందిన వాళ్లు మాటతీరు ఉందని ఆమె అన్నారు. పూర్తి అవగాహన లేకుండా ఏది పడితే అది గాలి మాటలు మాట్లాడకూడదని మాజీ జడ్పిటిసి బుజ్జి చిన్నాలమ్మ ఉద్ఘాటించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular