పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు మిరియాల శిరీష దేవి అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో విజయవాడ అక్కడి నుండి నేరుగా శనివారం ఉదయం ఉర్లాకులపాడు గ్రామంలో కిడ్నీ వ్యాధి సంబంధిత వ్యాధులతో మృత్యువాత పడిన కుటుంబాలవారిని పరామర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజలు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నివిధాలా ప్రభుత్వం తరపున నేను అండగా ఉంటానని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి స్పష్టం చేశారు. మీడియాలలో మరణాలపై కథనాలు వచ్చిన నాటి నుండి ఎమ్మెల్యే శిరీష దేవి అసెంబ్లీ సమావేశంలో ఉన్నప్పటికీ జిల్లా ఆరోగ్య ఉన్నత అధికారులతో మాట్లాడి ఊర్లకులపాడు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించి పర్యవేక్షించారు. ఈక్రమంలోనే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కిడ్నీ సంబంధిత సమస్యలకు ఇక్కడ ప్రజలు ప్రైవేటు వైద్యులు వద్ద నొప్పులకు మందులు వాడటం, బీపీ షుగర్ కు మందులు సకాలంలో వాడకపోవడం, అతిగా మద్యం జీరుకు కళ్లు వంటివి సేవించడంవల్ల ఇక్కడ సమస్యల బారిన పడుతున్నట్లు ఎమ్మెల్యేకి జడ్డంగి ఆసుపత్రి వైద్యరాలు పావని వివరించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న పోలీసు అధికారులకు ఎమ్మెల్యే శిరీష దేవి గ్రామాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ నాటు సారా తయారీ, అమ్మకాలు లేకుండా పూర్తిగా నివారించాలని సూచించారు. నీటి సమస్యపై వ్యాధుల బారిన పడుతున్నారన్న అపోహలను గ్రామ ప్రజల అందరి ముందరనే ఆర్డబ్ల్యూఎస్ అధికారి సీతారాం మంచినీటిలో లోపాలు లేవని లాబ్ లలో వచ్చిన ఆధారిత నివేదికల ఆధారంగా ధృవీకరించారు. ఈకార్యక్ర మంలో రంపచోడవరం జిల్లా వైద్యాధికారి ణి డా. సరిత, ఎంపిడిఓ లోకుల యాదగిరీశ్వర రావు ఏఎంసీ చైర్మన్ లోతా లక్ష్మణరావు సొసైటీ చైర్మన్ ముప్పన కేశవ మాజీ సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతారావ్ మాజీ జడ్పీటీసీ కోసూరి బుజ్జి చిన్నాలమ్మ ఏయంసి డైరెక్టర్ గట్టి మాణిక్యం సర్పంచ్ తొంటా ఆది రాజు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి గంగాధర రావు, తెలుగు యువత అధ్యక్షుడు మారింది అనుదీప్ జడ్డంగి మాజీ సర్పంచ్ కోపూరి రత్నం, టీడీపీ శ్రేణులు చెక్క పండు, మాకిరెడ్డి లోవరాజు వీరబాబు సాగిన చిన్నమ్ములు తదితరులు పాల్గొన్నారు.
ఉర్లాకులపాడు గ్రామంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే: పరామర్శ
RELATED ARTICLES
