పోలవరం జిల్లావాణి ప్రతినిధి: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ ఛైర్పర్సన్ మిరియాల శిరీష దేవి శనివారం ఉదయం మారేడుబాక పంచాయతీలోని ఉర్లాకులపాడు గ్రామానికి వచ్చిన ఆమె స్థానిక మాజీ జడ్పిటిసి కోసూరు బుజ్జి చిన్నలమ్మ ఇంటి వద్ద మీడియాతో ఇష్టఘోష్టిగా మాట్లాడారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నేరుగా నియోజకవర్గంలోని ఆమె ఉర్లాకులపాడు గ్రామంలోని మృతుల కుటుంబాలకు పరామర్శించిన అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా జీవో నెంబర్ త్రీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మరికొందరు గిరిజన ఎమ్మెల్యేలతో కలిసి జీవో నెంబర్ త్రీ కోసం చర్చించడం జరిగిందన్నారు. ప్రభుత్వం జీవో నెంబర్ 3 కి అనుగుణంగా ప్రత్యామ్నాయ జీవోను తీసుకురావాలని కోరినట్లు ఆమె వాపోయారు. దానికి ముఖ్యమంత్రి గత 2024ఎన్నికల సమయంలో అరకు సభలో ఇచ్చిన మాట ప్రకారం జీవో నెంబర్ 3 కి ఎక్కడ తీసుపో కుండా దానికి అనుకూలంగా జీవోను తీసుకురావడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మీడియా ద్వారా ఎమ్మెల్యే శిరీష దేవి వివరించారు. గత వైసిపి ప్రభుత్వ రీ వ్యూ పిటిషన్ వేయకపోవడంతో వారి స్వార్థ పూరిత అనాలోచన కారణంచేతనే జీవో నెంబర్ 3 ని కోల్పోయినట్టుగా ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. తమ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు మరియు గిరిజన ప్రాంత ప్రజల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈకార్యక్ర మంలో ఆమె వెంట ఏఎంసీ చైర్మన్ లోతా లక్ష్మణరావు సొసైటీ చైర్మన్ ముప్పన కేశవ మాజీ సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతారావ్ మాజీ జడ్పీటీసీ కోసూరి బుజ్జి చిన్నాలమ్మ ఏయంసి డైరెక్టర్ గట్టి మాణిక్యం టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి గంగాధర రావు, తెలుగు యువత అధ్యక్షుడు బారంగి అనుదీప్ జడ్డంగి మాజీ సర్పంచ్ కోపూరి రత్నం, టీడీపీ శ్రేణులు చెక్క పండు, మాకిరెడ్డి లోవరాజు వీరబాబు సాగిన చిన్నమ్ములు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి దృష్టికి కీలక అంశాలు ఎమ్మెల్యే: శిరీష
RELATED ARTICLES
