పోలవరం జిల్లా వాణి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు వితంతులకు దివ్యాంగులకు మరియు కిడ్నీ తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సామాజిక భద్రత పింఛన్లు మునిపెన్నడు లేనంత విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హులైన పింఛన్దారులకు నేరుగా వారింటికె అందజేస్తుంది. మార్చి నెల ఒకటో తారీకు ఆదివారం రావడంతో ఒకటవ తేదీన ఇవ్వవలసిన పెన్షన్లను ఒకరోజు ముందు రోజు ముందుగానే ఫిబ్రవరి నెల చివరి రోజు 28న పెన్షన్ లబ్ధిదారులకు ఇంటింటికి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులు అందజేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు, కిడ్నీ తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పింఛన్ డబ్బులు ఉదయాన్నే పంపిణీ చేస్తున్నారు.
ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛను నగదు అందజేత
RELATED ARTICLES
