కోటనందూరు జిల్లా వాణి ప్రతినిధి
కాకినాడ జిల్లా కోటనందూరు మండలం జగన్నాధపురం గ్రామ శివారు బొండుగడ్డ ప్రవాహ ప్రాంతం ఒడ్డున శ్రీ శ్రీ చలాలమ్మ అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జగన్నాధపురం గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఆధ్యాత్మిక సోపసంతరించుకుంది మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తాడిపెద్దు చోరాట, కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో విశేష ద్రవ్యాలతో హోమ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గాడి రాజబాబు, మండల పార్టీ ప్రెసిడెంట్ పోతల సూరిబాబు దర్శించుకున్నారు. ఆయనతోపాటు గ్రామ పెద్దలు మాతి రెడ్డి భాస్కరరావు, గొర్లి అచ్చయ్య నాయుడు , ఎర్ర చిన్న సత్యనారాయణ, గుడివాడ అప్పలనాయుడు మాస్టారు, గొర్లి రామచంద్రరావు , ఆలయకమిటి సభ్యులు కరక వెంకట రమణ, గుడివాడ సత్యనారాయణ ,సుర్ల చిట్టిబాబు , భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
