Thursday, April 16, 2026
HomeAndhra Pradeshపోలవరం జిల్లాలో ఎటువంటి వంట గ్యాస్ కొరత లేదు ఐటిడిఎ పీవో: స్మారన్ రాజ్

పోలవరం జిల్లాలో ఎటువంటి వంట గ్యాస్ కొరత లేదు ఐటిడిఎ పీవో: స్మారన్ రాజ్

పోలవరం జిల్లావాణి ప్రతినిధి:పోలవరం జిల్లాలోని వంట గ్యాస్ కొరత వదంతులు నమ్మవద్దని రంపచోడవరం ఐటీడీఎ ప్రాజెక్టు అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ మీడియా పత్రిక ప్రకటన ద్వారా ప్రజలకు వివరించారు. ఈమేరకు శనివారం రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్ మాట్లాడుతూ పోలవరం జిల్లాలోని వంట గ్యాస్ కొరత ఏర్పడుతుందని వంటగ్యాస్ రేట్లు పెరుగుతాయని వచ్చిన వదంతులు పోలవరం జిల్లాలోని ప్రజలు నమ్మవద్దని ఆయన అన్నారు. వంటగ్యాసు కొరత ఏర్పడుతుందని రేట్లు పెరుగుతాయని వదంతుల వలన కొంతమంది గ్యాస్ వెంటవెంటనే బుక్ చేసుకుంటున్నారని అదేవిధంగా పోలవరం జిల్లాలోని వంట గ్యాస్ కొరత లేదని ఆయన అన్నారు. వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందని వచ్చిన వదంతులను ఈ ప్రాంత ప్రజలు ఎట్టి పరిస్థితులలో నమ్మవద్దని జాయింట్ కలెక్టర్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular