పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ప్రభుత్వాదేశాల ప్రకారం విద్యార్ధులకు అందించే వాటిలో రాజీ కుదరదని రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ కమిటి చైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి అన్నారు. రంపచోడవరం మండలంలోని నల్లగొండ ఆశ్రమ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే శిరీష దేవి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్ధులకు అందించే ఆహార పదార్థాల మెనూ ప్రకారం అమలు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. వంటగదిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సుశించారు. ఇదే క్రమంలో పాఠశాలకు చెందిన పలు రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్ధుల విద్యా బోధనలో కూడా పూర్తి పర్యవేక్షణతో సాగాలని ఉత్తీర్ణత శాతం పెంపుదలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్ధులకు గానీ, పాఠశాల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తన దృష్టికి నేరుగా తీసుకొని రావాలని సిబ్బందికి ఎమ్మెల్యే తెలియజేశారు. ఆశ్రమ పాఠశాలలోని విద్యావ్యవస్థపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. గుత్తేదారులు సకాలంలో కూరగాయలు , గుడ్లు , చికెన్ తీసుకువస్తున్నారా లేదా అన్నదానిపై ఆరా తీసారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఉంటే వాటిని ఉపయోగించొద్దని అన్నారు. నాణ్యతతో సరుకులు సరఫరా చేయకపోతే గుత్తేదారు నుండి తీసుకోవద్దని నాణ్యమైన ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉంటేనే తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్ధులతో కలసి భోజనం చేసిన ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు తనిఖీలప్పుడే కాకుండా అన్నివేళలా పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్ .మల్లమ్మ , వార్డెన్ ఎల్.సౌజ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆశ్రమ పాఠశాలల్లోని విద్యా వ్యవస్థపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తుంది: ఎమ్మెల్యే
RELATED ARTICLES
