పోలవరం జిల్లావాణి ప్రతినిధి: విధుల్లో చేరిన మొదటి రోజే పోలవరం జిల్లా కలెక్టర్ రంపచోడవరం డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన రోగులకు వెంటనే వైద్య పరీక్షలు చేసి ఆయావ్యాధులకు ఉచిత మందులు అందజేయాలని వైద్యాధికారులను పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంకాలం గంగవరం మండలంలోని గంగవరం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, గ్రామ సచివాలయాన్ని, గిరిజన సంక్షేమ శాఖ బాలురు ఆశ్రమ పాఠశాలను పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ ఆకస్మికంగా పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా నూతన పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన రోగులకు వెంటనే స్పందించి వైద్య పరీక్షలు నిర్వహించి ఆయా వ్యాధులకు ఉచిత మందులు అందజేయాలని ఆయన అన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నది, ఎంతమంది జనాభా ఉన్నది అదేవిధంగా ఎంతమంది వైద్యాధికారులు ఉన్నది ఎంతమంది సిబ్బంది ఉన్నది ఆయన ఆరా తీశారు. వివిధ వ్యాధులకు సంబంధించిన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అదేవిధంగా గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వారు పరిశీలించి ఈ సచివాలయం పరిధిలోని గ్రామాలలోని ప్రజలకు ఏ సేవలు అందించుచున్నది ఆయన ఆరా తీశారు. ఈ సచివాలయంలో ఎంతమంది సిబ్బంది ఉన్నది ఏ పనులు చేయుచున్నది ఆయన ఆరా తీశారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ బాలురు ఆశ్రమం పాఠశాలను పరిశీలించి ఈ పాఠశాలలో ఎంతమంది బాలురు ఉన్నది ప్రభుత్వం నిబంధన ప్రకారం మెనూ అమలు చేయుచున్నది లేనిది ఆయన ఆరా తీశారు. విద్యార్థులకు విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. విద్యార్థులకు ప్రతిరోజు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు అర్థమవుతున్నది లేనిది ఆయన ఆరా తీశారు. విద్యార్థులకు ఒకటికి రెండుసార్లు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పాలని ఆయన అన్నారు. ఈ సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు ఎక్కువమంది పాస్ అవ్వాలని అందుకు విద్యార్థులు అందరూ బాగా చదవాలని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం నిర్ణయించుకొని ఏ చదువులు చదవాలో అదేవిధంగా ఏ ఉద్యోగాలు చేయాలని అనుకుంటున్నారు ముందుగా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ వారి వెంట తాసిల్దార్ సిహెచ్ శ్రీనివాసరావు, ఎంపీడీవో లక్ష్మణ్, ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, వైద్యాధికారిణి శ్వేత, పిడి. కే.తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక కేంద్రాన్ని, గ్రామ సచివాలయాన్ని, వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
RELATED ARTICLES
