Thursday, April 16, 2026
HomeAndhra Pradeshబస్సు సర్వీసులు పునరుద్ధరించండి లేదంటే నిరసనలు చేస్తాం గిరిజన నేత: రామారావు

బస్సు సర్వీసులు పునరుద్ధరించండి లేదంటే నిరసనలు చేస్తాం గిరిజన నేత: రామారావు

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఏపీఎస్ఆర్టీసీ డిపో నర్సీపట్నం నుండి వయ కెడి. పేట కాకరపాడు మీదుగా రంపచోడవరం డివిజన్ లోని పర్యాటక ప్రాంతమైన మారేడుమిల్లి మండల ప్రధాన కేంద్రం వరకు రోజూవారి రాకపోకలు చేస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసును పలు కారణాలు సాకుగా చూపిస్తు బస్ రవాణ సర్వీసులు నిలిపియ్యడం సరికాదని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు మంగళవారం మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. నర్సీపట్నం నుండి విశాఖపట్నంకు వివిధ బస్సు సర్వీసులు ఉన్నప్పట్టికీ ఏ విధమైన ముందస్తు సమాచారం లేకుండా గిరిజన ప్రాంత ప్రజానీకానికి ఎంతగానో ఉపయోగపడే ఒక్కగాను ఒక్క సర్వీస్ నిలిపోయడం దారుణమైన చర్యగా ఆయన అభివర్ణించారు. పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరంకి డివిజన్ పరిధిలోని ఉన్న గిరిజనులు ఉద్యోగులు వెళ్ళడానికి ఒక్క బస్సు సర్వీస్ మాత్రమే ఉందని రామారావు అన్నారు. వెంటనే బస్సు సర్వీసును పునరుద్ధరించాలని రామారావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రయాణికులతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular