పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూగర్భ జలాల పెంపే ప్రధాన లక్ష్యంగా 100 రోజుల ప్రణాళికలతో ముందుకు వెళుతుందని మాజీ సొసైటీ అధ్యక్షుడు జీ తాతారావ్ అన్నారు. ఈ సందర్భంగా జడ్డంగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమంను ఉద్దేశించి తాతారావ్ మాట్లాడారు. భూగర్భ జలాలు 8మీటర్లు లోతున ఉన్నవి 3మీటర్లు లోతుకు తీసుకువచ్చే లక్ష్యంతో ప్రతీ నీటిబొట్టును ఒడిసి పట్టుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . చెరువులు రిజర్వాయర్లు కాలువలు పటిష్టం చేసి ప్రతి నీటిబొట్టు వృథా కాకుండా ఉండేలా చూడాలని కోరారు. అనంతరం పంచాయతీలోని రేవటిపాలెం గ్రామంలో చీడిమాని చెరువు సందర్శించారు. పూడికతీత గట్లు అభివృద్ధి స్లూయిజ్ నిర్మాణం చేయాల్సి ఉందని గుర్తించారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతారావు జడ్డంగి పీసా చట్టం ఉపాధ్యక్షుడు దబ్బా దివాకర్, మాజీ జడ్డంగి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ వాసంశెట్టి గంగాధర్ గ్రామ పెద్దలు ముంగారి అమ్మన్న చెక్కా పండుబాబు, పులిమెట్ల వెంకటరమణ, బారంగి అనుదీప్, రాటా సోమరాజు ఇంజనీరింగ్ అసిస్టెంట్ సన్యాసిరెడ్డి అగ్రికల్చరల్ అసిస్టెంట్ శ్రీను ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కోపూరి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ నీటిబొట్టును ఒడిసి పట్టుకుని సద్వినియోగం చేసుకోవాలి మాజీ సొసైటీ అధ్యక్షుడు: తాతరావు
RELATED ARTICLES
