పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఇటివలే సర్పంచ్ల పదవీకాలం ముగిసిన సంగతే తెలిసిందే. ఈ క్రమంలో రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం వాతంగి గ్రామానికి చెందిన వర్తకుడు అధ్య రమేష్ అనే వ్యక్తి రాజవొమ్మంగి మండలంలోని పలువురు సర్పంచులకు పూలమాలలు వేసి, శాలువా కప్పి, మెమెంటోలతో ఘనంగా సత్కరించి వారిపై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం లోని గ్రామ పంచాయతీలో ఐదేళ్ళు సర్పంచ్ లుగా ఎననలేని సేవలందించిన వారికి సత్కరించడం చాలా సంతోషంగా ఉంటుందని ఆయన వాపోయారు. ఈకార్యక్రమంలో పలు గ్రామ పంచాయతీలకు చెందిన 12 మంది మాజీ సర్పంచులు మరియు మండలంలోని పలు గ్రామాలకు చెందిన పెద్దలు స్థానిక ప్రజలు తదితరులు హాజరయ్యారు.
కొమరపురంలో మాజీ సర్పంచ్ లకు ఘనంగా సన్మానం
RELATED ARTICLES
