Thursday, April 16, 2026
HomeAndhra Pradeshఏపియుడబ్ల్యూజె యూనియన్ సమావేశంలో జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే: శిరీష దేవి

ఏపియుడబ్ల్యూజె యూనియన్ సమావేశంలో జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే: శిరీష దేవి

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఏజెన్సీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతూ ప్రభుత్వానికి ప్రజలకు మరియు అధికారులకు వారధిగా ఉంటూ పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు ప్రత్యేక కృషి చేస్తానని రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషదేవి అన్నారు. పోలవరం జిల్లాగా ఏర్పడ్డా తరువాత ఏపియుడబ్ల్యూజె ఆధ్వర్యంలో సోమవారం నాడు ఏర్పాటు చేసిన మొట్ట మొదటి ఏపియుడబ్ల్యూజె యూనియన్ సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే శిరీష మాట్లాడారు. ఈక్రమంలో జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఎమ్మెల్యే శిరీష దృష్టికి పాత్రికేయులు తీసుకెళ్లగా ఆమె వాటి పరిష్కారానికి ఆమె సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా మీడియా ప్రతినిధులు ప్రభుత్వం నుంచి పొందే రాయితీలులో ఏజన్సీలో గిరిజన చట్టాల అడ్డంకి వాళ్ళ జర్నలిస్టులు కోల్పోతున్న వాటి కోసం ఎమ్మెల్యే ముందు ప్రస్తావించగా ముఖ్యమంత్రి వారితో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. తదనంతరం ఎస్టీ కమిటి చైర్మన్ బొజ్జి రెడ్డి, ఎస్టీ సంక్షేమ కమిటీ డైరెక్టర్ గొర్లె సునీత, చింతూరు మండల తెలుగు దేశం అధ్యక్షులు జమాల్ ఖాన్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో ఏపియుడబ్ల్యూజె రాష్ట్ర నాయకులు ఐవి సుబ్బారావు, యూనియన్ ముఖ్య నాయకులు స్వాతి ప్రసాద్, శ్రీరామ మూర్తి మరియు పోలవరం జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్ పరిధిలోని ఏపియుడబ్ల్యూజె యూనియన్ కి చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular