Thursday, April 23, 2026
HomeAndhra Pradeshఆమెకు అసెంబ్లీలో సమస్యలపై మైకు ముందు అనర్గళంగా మాట్లాడడమే కాదు, గరిటి పట్టుకొని ఇంట్లో వండి...

ఆమెకు అసెంబ్లీలో సమస్యలపై మైకు ముందు అనర్గళంగా మాట్లాడడమే కాదు, గరిటి పట్టుకొని ఇంట్లో వండి వడ్డించి పెట్టడం కూడా తెలుసు , ఇంతకు ఎవరు ఆమె తెలుసుకుందాం రండి.!

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం నియోజవర్గం శాసనసభ్యురాలు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ కమిటీ ఛైర్పర్సన్ మిరియాల శిరీష దేవికి ఏమాత్రం హంగు ఆర్భాటం లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.! అవును ఎందుకు ఇంతా కచ్చితంగా చెప్పుకోవచ్చునో పూర్తిగా తెలుసుకుందాం..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనే అతిపెద్ద విస్తీర్ణం కలిగిన నియోజకవర్గానికి తాను ఒక ఎమ్మెల్యేననే ఏమాత్రం గర్వం లేకుండా తాను ఒకప్పట్టి అంగన్వాడీ టీచర్ మాదిరిగానే ప్రస్తుతం కూడా అదే విధంగా వ్యవహరించడంపై ప్రజలు ఎంతగానో హర్షిస్తున్నారు. తాను ఎమ్మెల్యే అయినప్పటి నుండి తనకు తోచిన కాడికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.! మునిపెన్నడు లేనంత విధంగా రంపచోడవరం నియోజకవర్గ ప్రజానీకానికి ఎప్పటికప్పుడు ఎనలేని సేవలు అందిస్తూ ఎంతోమందికి ఆదర్శమవుతున్నారు. అనునిత్యం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో క్షణం తీరిక లేకుండా ఉండే తాను ఇటీవలే జరిగిన పలు పబ్లిక్ పరీక్షలలో చక్కటి ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు సగౌరవంగా సన్మానించాలనే సదుద్దేశంతో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులకు తన నివాసానికి స్వాగతించారు. అంతేకాకుండా ఉదయం నుండి తన చేతులతో వంటలను వండి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు దగ్గరుండి ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, ఆమె భర్త మఠం విజయభాస్కర్ దంపతులు ప్రేమగా భోజనాలు వడ్డించారు. అనంతరం కాసేపు విద్యార్థులతో మమేకమై వారితో ముచ్చటించారు. తదనంతరం వై రామవరం గురుకుల కళాశాలలో ఎంపీసీ చదివి మొత్తం 1000 మార్కులకు గాను అత్యధిక 986 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించిన దూరిపల్లి శర్వాణి శ్రీ సునందకు ఎమ్మెల్యే శిరీష దేవి అభినందిస్తూ శాలువాతో సత్కరించి 15000 రూ.లు ప్రోత్సాహ నగదును అందజేశారు. అలాగే ఒకేషనల్ గ్రూప్ లో 985/1000 మార్కులు సాధించిన బి.వెంకట సాయి మంజులకు 10,000 రూ.లు నగదు అందజేశారు . బైపిసి గ్రూపు లో 976/1000 మార్కులు సాధించిన తామ వెంకటేష్ కు రూ;5000 రూ.లు నగదు అందజేశారు. బైపిసి గ్రూపు లో 975/1000 మార్కులు సాధించిన ఎన్.అఖిల, ఎంపీసీలో 971/1000 మార్కులు సాధించిన పల్లాల రవీంద్ర రెడ్డి, ఎంపీసీలో 966/1000 మార్కులు సాధించిన బి. సత్యశ్రీ లను అభినందించారు. ఇదే క్రమంలో ఏకలవ్య పాఠశాలల్లో రాష్ట్ర స్థాయిలో సిబిఎస్సి ఫలితాల్లో ఎమ్.జయ రామకృష్ణ 478/500 మార్కులు సాధించిన ఆయనకు 5000 రూ.లు మరియు ద్వితీయ స్థానంలో నిలిచిన బి.నవతేజ మరియు తృతీయ స్థానంలో నిలిచిన వెంకట లక్ష్మి లకు 5000 రూ.లు చొప్పున ప్రోత్సాహం నగదు మరియు స్వీట్ బాక్సులను అందించి విద్యార్థుల ఊహకు అందని రీతిలో ఘనంగా సన్మానించి, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని శాసనసభ్యులు శిరీష దేవి ఆకాంక్షించారు. ఈ కార్య క్రమంలో రంపచోడవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు , ఎమ్మెల్యే భర్త మఠం విజయ్ భాస్కర్ , ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు, తెదేపా సీనియర్ నాయకులు గణజాల తాతారావ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular